సిసి రోడ్ల నిర్మాణం

గోపనపల్లిలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గోపనపల్లి విలేజ్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డులు పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులకు ఆదేశించారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి నానక్ రామ్ గూడా వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు , స్థానిక నేతలు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking