యువత స్వశక్తితో ఎదగాలి
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి :
ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్క యువత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.శుక్రవారం సిన అక్టిన్ ఫిట్నెస్ జిమ్ ను మంత్రి ప్రారంభించారు. దుర్గానగర్ చౌరస్త్రలో నూతనంగా ఏర్పస్తూ చేసిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ దుర్గా నగర్ ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయగా శ్రీనివాస్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువత స్వశక్తితో ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం నవీన జీవితంలో రోగాల బారి నుండి మనలను మనం కాపాడుకోవడానికి అనునిత్యం వ్యాయామం, జిమ్ చేయాలనీ కొరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్, సదానందం గౌడ్,సత్యం గౌడ్, మహేశ్ గౌడ్, రోహిత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.