మిర్యాలగూడ సమగ్రాభివృద్ధికి కృషి
* సుందరయ్య పార్క్ లో 64లక్షల రూపాయల నిధులతో మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్, హై మాస్ట్ లైట్స్, పాదచారులకు వాకింగ్ ట్రాక్ ప్రారంభం
నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం శక్తి,వంచన లేకుండా కృషి చేస్తున్నామని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.

శనివారం రాత్రి స్థానిక సుందరయ్య పార్క్ సుందరీకరణ చర్యల్లో భాగంగా 64లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్, హై మాస్ట్ లైట్స్, పాదచారులకు వాకింగ్ ట్రాక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు.

మిర్యాలగూడ పట్టణంలో సుందరీకరణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, డీఈ సాయి లక్ష్మి, కౌన్సిలర్లు సలీం, వంగాల నిరంజన్ రెడ్డి, బంటు రమేశ్, నాయకులు కందగట్ల అశోక్, అమృతం సత్యం, ఖాదర్, వేముల దుర్గారావు, గొంగిడి సైదిరెడ్డి, మన్నెం లింగారెడ్డి, మెరుగు సంజయ్, గుడిపాటి సైదులు బాబు, షేక్ నాగుల్ బాబా, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.