ఎస్సీ బాలుర హస్టల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఎస్సీ బాలుర హస్టల్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరం నూతన బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహం (బి) ఖమ్మం నందు భారత రాజ్యాంగ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగం ఏ విధంగా రూపొందించబడింది ఆ యొక్క చరిత్రను విద్యార్థులకు వివరించారు.రాజ్యాంగ పీఠికను విద్యార్థుల అందరిచే చదివించారు.ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ బాలుర వసతి గృహం (బి)సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు వసతిగృహంలోని నాలుగో తరగతి సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking