ఖమ్మం జిల్లా టిడిపి పార్టీలో చేరికలు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సీనీయర్ న్యాయవాది ముప్పిడి శ్యామ్ సుధాకర్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు మాజీ శాసనసభ్యులు కాట్రగడ్డ ప్రసూన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కనగాల సాంబశివరావు ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వరరావు సమక్షంలో పసుపు పచ్చ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్ రాష్ట్ర కార్యదర్శి చేతుల నాగేశ్వరరావు ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగార్జున శ్రీనివాస్ ఖమ్మం నగర కన్వీనర్ మల్లెంపాటి అప్పారావు ఖమ్మం నగర మహిళా అధ్యక్షురాలు చుండూరు రాజరాజేశ్వరి నాయకులు పాలడుగు క్రిష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.