ప్రమాదంలో భారత రాజ్యాంగం

ప్రమాదంలో భారత రాజ్యాంగం

-రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను ప్రతిఘటించండి

-బిఎస్పి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడు మీద ఉన్నది రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం ప్రమాదపు టంచుల్లో ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాద ఆలోచనలతో కూడినటువంటి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటువంటి కుట్రలను చేదిస్తూ బహుజనులందరు ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని బిఎస్పి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు అన్నారు.బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారు ప్రసంగిస్తూ భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగమే పార్టీ మేనిఫెస్టో గా కలిగిన ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అన్నారు.
బహుజన సమాజ్ పార్టీని గెలిపించి బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.బహుజన బ్రతుకులు మారాలంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలంటే అది ప్రస్తుత రాజ్యాంగం తోటే సాధ్యం అని అన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని నూటికి నూరు శాతం అమలు చేయగలిగేటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిసి వీరస్వామి జిల్లా అడ్వైజర్ మట్టి గురుమూర్తి జిల్లా నాయకులు ఒగ్గు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking