*పిచ్చిరెడ్డి మృతి పట్ల* *టీయూడబ్ల్యూజే* *సంతాపం*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ప్రజల మనిషి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కామ్రేడ్ జి.పిచ్చిరెడ్డి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.
ఆదివారం నాడు హుజూర్ నగర్ లో జరిగిన టీయూడబ్ల్యూజే సూర్యాపేట జిల్లా మహాసభ సంతాపాన్ని ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, హుజూర్ నగర్, కోదాడ శాసన సభ్యులు సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కే.సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చలసాని శ్రీనివాస్ రావు, నాగేశ్వర్ రావులతో పాటు జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.
Prev Post
Next Post