అయ్యప్ప స్వాముల ఇరుముడిలో గాలిబ్ పాషా
-గాలిబ్ పాషాకి ఘన సన్మానం
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో శ్రీ సంతు సేవాలాల్ మహరాజ్ గుడినందు గురు స్వామి తేజావత్ కోటి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు.ఈ ఇరుముడి కార్యక్రమానికి టిఆర్ యస్ పార్టీ కొణిజర్ల మండల మైనార్టీ నాయకులు షేక్ గాలిబ్ పాషా హాజరైనారు.కుల మతాలకు అతీతంగా గాలిబ్ పాషా అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేయటం వారికి అన్ని విధాలుగా సహాకరించటంతో అయ్యప్ప స్వాములు ప్రభాకర్ రామ్మూర్తి నాగేశ్వరరావు రామకృష్ణ స్వాములు గాలిబ్ పాషా ని ఘనంగా సన్మానించారు.ఈ సంధర్బంగా గాలిబ్ పాషా అయ్యప్ప స్వాములు శబరిమలై యాత్ర క్షేమంగా వెళ్ళి రావాలని ఆకాంక్షీంచారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు ఖాదర్ బాబు బాబు సాహెబ్ హస్సేన్ నాగ సైదులు తదితురులు హాజరైనారు.