తిప్పనకు ఘన సన్మానం, అభినందనలు
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డిని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అభినందించారు. వైదేహి వెంచర్ లోని తిప్పన నివాసంలో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, టీఆర్ఎస్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, నూకల హన్మంత్ రెడ్డి, కొండేటి సిద్ధయ్య, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.