కార్మికులకు సంక్షేమ పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి
*సిఐటియు రాష్ట్ర నేతలు మల్లేష్, గౌతంరెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని సిఐటియు రాష్ట్ర నాయకులు డి.మల్లేష్, డాక్టర్ గౌతంరెడ్డి అన్నారు. ఆదివారం బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులతో హక్కుల సాధన కోసం బలమైన పోరాటాలు చేయాలన్నారు. ప్రతి కార్మికుడు సభ్యత్వం తీసుకొని సంక్షేమ పథకాలు అర్హులు కావాలన్నారు. అనంతరం పెయింటింగ్ యూనియన్ లో ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ సైదులు నాయక్ ను ఎన్నుకున్నారు. సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. బిఉఎం నాయుడు, పెయింటింగ్ యూనియన్ అధ్యక్షులు. మంద రాజు, ఉపాధ్యక్షుడు నాగుల్ మీరా. వి.సురేందర్, కోశాధికారి పాశం గోవర్ధన్రెడ్డి, బుజ్జిబాబు, గౌస్, క్రాంతి, శివ, నాగవెల్లి శ్రీను, మాతంగి శ్రవణ్, ఎస్.సైదులు, ఎ.రాంబాబు, పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.