ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల గ్రామంలో ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి పువ్వాడ ను పంక్షన్ హాల్ నిర్వాహకులు శీతల మంగమ్మ- రామ సంఘం దంపతులు శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క హాజరై నిర్వహకుల శీతల మంగమ్మ-రామ సంఘం లకు శుభాకాంక్షలు తెలిపారు.ఖమ్మం మాజీ పోంగులేటీ శ్రీనివాసరెడ్డి హాజరై వారిని ఆశీర్వదించారు.ఈ పంక్షన్ హాల్ ప్రారభ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కార్పొరేటర్ దోరేపల్లి శ్వేతా మేడారపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.