ఉవ్వెత్తున ఉద్యమకారుల ఉద్యమం

తెలంగాణ ఉద్యమ కారుల ఐక్యత వర్ధిల్లాలి

ఖమ్మం/ అక్షిత బ్యూరో : ఉద్యమ కారుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుంది.సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరబాద్ లో తెలంగాణ ఉద్యమ కారుల రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ అధ్వర్యంలో రాష్ట్ర విస్త్రత స్థాయి సమావేశానికి ఖమ్మం జిల్లా కి చెందిన డాక్టర్ కేవి కృష్ణారావు నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ నాయకులు భారీగా హాజరై విజయవంతం చేశారు.ఈ సంధర్బంగా మహిళా కమిటీ ఏర్పాటు చేయటం అదేవిధంగా కొన్ని తీర్మానాలు చేశారు.2023 మార్చి నెలలో చలో ఇందిరా పార్క్ కార్యక్రమం చేపట్టాలని ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి దళిత బంధువు డబుల్ బెడ్రూం ఇల్లు పెన్షన్లు ఇవ్వాలని ఉద్యమకారులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఇచ్చి సమాజ సేవలో బాగస్వామ్యం చేయాలని తీర్మానించినారు.ఈ కార్యక్రమంలో భూక్యా రాంబాబు నాయక్ నెలవెల్లి వెంకటేశ్వరరావు భూక్యా శ్రీనివాస్ నాయక్ దొంతా నరసింహారావు బచ్చు రమణ బానోత్ భద్రు నాయక్ గుంట్రురామకృష్ణ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking