ఆచార్యుల గూడెంలో దోమల నివారణకు ఫాగింగ్
చిలుకూరు, ఆగస్టు 26 (అక్షిత న్యూస్) :
మండల పరిధిలోని ఆచార్యుల గూడెం గ్రామంలో దోమల బెడదను నివారించేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ బొడ్డుపల్లి లక్ష్మీ బిక్షం ఆధ్వర్యంలో దోమల నివారణ యంత్రంతో ఫాగింగ్ నిర్వహించారు. వీధులు, నివాస ప్రాంతాల్లో యంత్రం ద్వారా పొగను కొట్టించి దోమలను నియంత్రించే చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల నివారణ చర్యలను నిరంతరం కొనసాగిస్తామని సిబ్బంది తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.