కోదాడ మండలం ద్వారకుంట వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి
ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ
కోదాడ, అక్షిత ప్రతినిధి :
కోదాడ మండలం ద్వారకుంట వద్ద తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ ఘటనాస్థలికి చేరుకున్నారు.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.ప్రమాదం ఎలా జరిగింది. ఎంతమంది మృతి చెందారు వారి పరిస్థితి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.

అనంతరం కోదాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ.. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.