పట్టణ ప్రగతికి పరుగులు…

ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం

* అందరి భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి
* పలు వార్డుల్లో రూ.55 లక్షల మున్సిపల్ శాఖ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన
* మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో పలు వార్డుల్లో రూ.55 లక్షల మున్సిపల్ శాఖ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను భాస్కర్ రావు ఆదివారం ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.20లక్షలు, బాపూజీ నగర్ లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 15లక్షలు, 5వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.15 లక్షల నిధులు మంజూరయ్యాయని అన్నారు. పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో అస్మదీయులు…తస్మదీయులనే భేదాలు తమకు లేవని భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృడ సంకల్పంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో నాలాల పరిశుభ్రత, పొదలు,పిచ్చి మొక్కల తొలగింపు, విద్యుత్ దీపాల పర్యవేక్షణ, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయుట,పార్కు పరిశుభ్రత, అక్రమ నిర్మాణాల తొలగింపు తదితర పనులను మున్సిపల్ అధికారులు నిరంతర ప్రక్రియగా భావించి నిర్వహించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు,వార్డు ఇంఛార్జీలు తమ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అన్నారు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. వానాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీల జాబితాలో చేర్చేందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్,
వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మున్సిపల్ డీఈ సాయిలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అన్నభీమోజు నాగార్జున చారి, నూకల హన్మంత్ రెడ్డి, కౌన్సిలర్లు ఇందిరమ్మ-గోవింద్ రెడ్డి, జావిద్, ఉదయ భాస్కర్, మలగం రేమేష్, వంగాల నిరంజన్ రెడ్డి, గొంగిడి సైదిరెడ్డి, పత్తిపాటి నవాబ్, పునాటి లక్ష్మీనారాయణ, బాసాని గిరి, ఆంజనేయరాజు, మన్నెం లింగారెడ్డి, తిరుమలగిరి వజ్రం, యర్రమల్ల దినేష్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, గోపాలకృష్ణ, వేణుగోపాల్ రావు, మీసాల జగదీష్, జానకి రెడ్డి, సక్రం నాయక్ తదితరులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking