అంబేద్కర్ చూపిన
మార్గంలో నడవాలి
*ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ వర్ధంతి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
భారత రత్న, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో సమాజ క్షేమం కోసం జర్నలిస్టులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఖాజా హామీదోద్దీన్, ఆయూబ్, వెంకన్న, నామిరెడ్డి నరేందర్ రెడ్డి, గుండా మహేష్, ఉప్పతల మహేష్, మంద సైదులు, జయరాజు, అరుణ్, నాగచారి, రాచకొండ రమేష్, ఉప్పతల మహేష్, నాగరాజు, నాగేందర్, సైదులు, శ్రీనివాస్, బంటు శ్రీను, బాబు, సాగర్, హరీష్, కె.దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.