అంబేడ్కర్ చూపిన బాట నిత్య అనుసరణీయం

అంబేడ్కర్ చూపిన
బాట నిత్య అనుసరణీయం

సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

బాబాసాహెబ్, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన బాట నిత్య అనుసరణీయమని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 66వ వర్ధంతి సందర్భంగా హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ హాల్ లో అంబేడ్కర్ చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సీజే మాట్లాడారు. భారత జాతికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత నివారణకు, దళితుల అభ్యున్నతి కోసం ఆయన కృషి ఫలితంగా అందరికీ సమాన హక్కులు, అవకాశాలు లభించాయని అన్నారు. భారత రాజ్యాంగం రచన కోసం ఆయన శ్రమించిన తీరును యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ డిఫెండర్, హైకోర్టు న్యాయవాది హమీద్ షేక్, టీఎస్ హెచ్ఏఏ ప్రెసిడెంట్ రఘునాథ్, సెక్రెటరీ జెల్లి నరేందర్, టీఎస్ హెచ్ఏఏ సభ్యులు, ఢిల్లీ హైకోర్టు న్యాయవాది కరణ్ సునేజా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking