తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శం : రేగా
పినపాక,, అక్షిత ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని నూతన పోలీస్ స్టేషన్ పనులను సందర్శించి మరియు క్వార్టర్లు ను సందర్శించి ఇక్కడ వారి సౌకర్యాల కోసం కోటి రూపాయలు నిధులు కేటాయిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ మణుగూరు పోలీస్ స్టేషన్ ఉద్యోగులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మరియు ఇతర సౌకర్యాల కోసం కోటి రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యోగుల అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పని చేస్తున్నదని సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థని సమర్థవంతమైన ప్రజలకు మార్చి ప్రజలకి సౌకర్యమైన పరిపాలన చేయుటలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ అభివృద్ధితోపాటు పోలీస్ వ్యవస్థ ఆధునికరణ పై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ ఖర్చుకు వెనకాడకుండా నూతన భవనాలను మంజూరు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ దేశాన్ని నిర్దేశంలో రాష్ట్రంలో శాంతి పద్ధతుల పరిరక్షణకు పోలీస్ శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ పోలీస్ లు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం బి ఆర్ యస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.