ప్లాస్టిక్ రహిత అన్నారంగా తీర్చిదిద్దుదాం
మన్నెం శ్రీధర్ రెడ్డి
మిర్యాలగూడ రూరల్, అక్షిత న్యూస్ :
ప్లాస్టిక్ రహిత అన్నారంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులందరి సహకారం అవసరమని మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ ఫౌండర్ చైర్మన్ మన్నెం శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నారం ప్రాధమిక పాఠశాలలో మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఫౌండర్ మన్నెం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేoదుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే ప్లాస్టిక్ రహిత అన్నారం గ్రామంగా మారాలని ఆయన పిలుపు నిచ్చారు.

ఊరులోని ప్రతి ఇంటికి క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. తొలుత పిల్లలకు బ్యాగ్ లు పంపిణీ చేశారు.అన్నారం గ్రామాన్ని దత్తత తీసుకుని విద్యాభివృద్ధికి పాటు పడుతున్న మన్నెం శ్రీధర్ రెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్డేపల్లి వెంకటేశ్వర్లు అభినందించారు. పాఠశాల విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేశారని వడ్డేపల్లి గుర్తు చేశారు.విద్యార్థులు తమ సృజనాత్మక కళారూపాలతో శ్రీధర్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ అంబటి వీరారెడ్డి, ఎస్ ఎంసీ ఛైర్మెన్ గురువయ్య,హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాలి సైదులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.