నేడు మండలంలో రేగా కాంతారావు పర్యటన
పినపాక, అక్షిత ప్రతినిధి :
పినపాక మండలంలో నేడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటన విస్తృతంగా ఉంటుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని ఏడూళ్ల బయ్యారం, పాత రెడ్డిపాలెం, గడ్డంపల్లి, పంచాయతీలలో నూతనంగా చేపట్టిన సిసి రోడ్ నిర్మాణాలను ప్రారంభించి కొత్తగా నిర్మించబోయే బీటీ రోడ్, సీసీ రోడ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.