ఉదయ సముద్రంతో లక్ష ఎకరాలకు సాగునీరు

ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష

ఎకరాలకు సాగునీరు 

 చిరుమర్తి లింగయ్య

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును త్వరలో పూర్తిచేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలలో లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేసి సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించనునట్లు వెల్లడించారు.

బుధవారం ఆ ప్రాజెక్టు పనులను పరిశీలించి పనులపై ఆరా తీశారు. అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. ప్రతి ఎకరానికి నీరు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టు పూర్తికి సహకరిస్తున్న కేసీఆర్ ,కేటీఆర్, జగదీశ్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ చిరు యాదయ్య, సర్పంచులు యానాల మాధవి, అశోక్, షులత శంకర్ గోపుల భద్రాచలం,నాయకులు మేక వెంకట్ రెడ్డి,అల్లే పరమేశం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking