అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరిన నరేష్ రెడ్డి
పినపాక, అక్షిత ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు బండ నరేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. శుక్రవారంనాడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పథకాలకు తోడు స్థానిక శాసన సభ్యులు రేగా కాంతారావు నాయకత్వ లక్షణాలకు ఆకర్షితుడనై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ సంధర్భంగా నరేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ చింతపంటి సత్యం, తోగ్గూడెం గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు చిట్టిమల్ల సతీష్ చారి, సల్లూరి లక్ష్మయ్య లు పాల్గొన్నారు.