టీఎస్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ గా ‘తిప్పన’ ప్రమాణం

టీఎస్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్

డెవలప్మెంట్ చైర్మన్ గా
‘తిప్పన’ ప్రమాణం


* అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, సిద్దార్ధ 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి టీఎస్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఆదివారం ప్రమాణం చేశారు. హైదరాబాద్ నగరంలో నాంపల్లిలోని రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, యువనేత నల్లమోతు సిద్దార్ధ పాల్గొన్నారు. టీఎస్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ గా ప్రమాణం చేసిన తిప్పన విజయసింహా రెడ్డి కి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో తిప్పన విజయసింహారెడ్డి మరెన్నో పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహోద్యమంలో తిప్పన విజయసింహారెడ్డి పాత్ర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking