కాంగ్రెస్ పార్టీలోకి పలువురిని చలమల్ల కృష్ణారెడ్డి ఆహ్వానించారు
మునుగోడు, అక్షిత ప్రతినిధి :
మునుగోడు మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులు, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మేక ప్రదీప్ రెడ్డి అధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బెల్లపు బాల శివ రాజు, అద్దంకి అంజయ్య, గాదరి దశరథ, అద్దంకి రమేష్, బెల్లపు ప్రసాద్,గోలి వెంకన్న,చింతపల్లి సాగర్ , కొంత మంది యువకులు వున్నారు.ఈ కార్యక్రమములో మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ సురిగీ నర్సింహ గౌడ్, ముచ్చపోతుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.