మృతుడు కుటుంబానికి ఆర్థిక సహాయం
గోలి శ్రీనివాస్ రెడ్డి
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బిఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తారసింగ్ నాయక్ తండ్రి రాంజ్య నాయక్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి 6 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్దండ సింగల్ విండో డైరెక్టర్ నాగుల నాయక్, తారా సింగ్, మజ్జిలాల్, ధర్మ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు