
బిఆర్ యస్ తో ప్రజలకు మరింత భరోసా
దేశ్ కీ నేత సీఎం కేసిఆర్
అభివృద్ధిని చూసే బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
పినపాక, అక్షిత ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ యస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో మణుగూరు మండలంలోని సమితి సింగారం, విప్పల సింగారం, జిఎం ఆఫీస్ సింగారం, పగిడేరు, ఉడతాని నగర్, కొండయిగూడెం, పినపాక మండలం ఏల్సిరెడ్డిపల్లి, గ్రామాల నుంచి వివిధ పార్టీల నుంచి సుమారు 300 కుటుంబాలు బి ఆర్ యస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆహ్వానించారు. అనంతరం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బి ఆర్ యస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బి ఆర్ యస్ వైపు ఉంటున్నారు. ఇల్లు లేని పేదలకు మూడు లక్షలు అందజేస్తామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బి ఆర్ యస్ పార్టీ ఆవిర్భావంతో సీఎం కేసీఆర్ పై మరింత భరోసా పెరిగిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో టిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించడం చాలా అవసరం అన్నారు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. జాతీయ రాజకీయాలలో బి ఆర్ యస్ తప్పక రాణిస్తుంది అన్నారు. భవిష్యత్తులో దేశ్ కీ నేత సీఎం కేసీఆర్ కావడం ఖాయమని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు కార్యకర్తల సంక్షేమం కోసం బి ఆర్ యస్ కట్టుబడి ఉన్నదని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపారన్నారు. అభివృద్ధి సంక్షేమం లో కేంద్ర మంత్రులు నీతి అయోగ్ లు దేశానికి రోల్ మోడల్ ఆదర్శమని తెలంగాణ ను ఎన్నోసార్లు అభినందించారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నట్లుగానే దేశాన్ని కూడా అదే మార్గంలో తీసుకువెళ్లాలి దేశంలో మార్పు తేవాలి సీఎం కేసీఆర్ తలపెట్టిన మహా యజ్ఞము ఇది జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాలనే సంకల్పంతో BRS పార్టీగా మారుస్తూ గత అక్టోబర్లో విజయదశమి పర్వదినం ప్రకటించడం జరిగింది. నేడు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరును ధ్రువీకరించడం సంతోషకరమైన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో 1,00,116/రూపాయిలు ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వరం లాంటిదని అన్నారు. ఆసరా పెన్షన్ రైతుల కోసం రైతుబంధు రైతు బీమా 24 గంటల్లో ఉచిత కరెంటు పేదలకు పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, చిన్నారుల కోసం కేసీఆర్ కిట్టు లాంటి పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.