ట్రైబల్ జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడుతాం
తెలంగాణ రాష్ట్ర నాయకులు బాణోత్ వెంకన్న
మహబూబాబాద్, అక్షిత ప్రతినిధి :
టిడబ్ల్యూ జేఏ ట్రైబల్ జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడాలని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బాణోత్ వెంకన్న పిలుపునిచ్చారు. ఆదివారం గూడూరు మండల కేంద్రంలో భీమునిపాదం వద్ద ఏర్పాటు చేసిన ట్రైబల్ జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన గిరిజన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఇళ్ళ స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మానుకోట జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఎటువంటి షరతులు లేకుండా ఐటీడీఏ నిధుల నుండి గిరిజన జర్నలిస్టులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. హెల్త్ కార్డులను జారీ చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ జర్నలిస్ట్ సమస్యల పరిస్కారం కోసం ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉద్యమం ఉవ్వెత్తున చేస్తుందని ఆయన అన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు రాము నాయక్ మాట్లాడుతూ జిల్లా ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా చూస్తానని ఈ ఆత్మీయ సమ్మేళనంకు విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులకు అంతేగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల రవి నాయక్, లక్ష్మణ్, గౌరవ అధ్యక్షుడు రాము నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, బాలాజీ, మహేందర్, మురళి, నరసింహ, రాజు,భూక్యా మోహన్ నాయక్ , హుస్సేన్ , యాకుబ్ తదితరులు పాల్గొన్నారు