
విదేశీ విద్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మేడ్చల్ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి జి.వినోద్ కుమార్
స్టెప్ఇన్ లీడ్స్ అకాడమీ 5వ వార్షికోత్సవo
స్టెఫెన్ లీడ్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్లు వంగూరి బ్రహ్మయ్య, ఉదయ్ కిరణ్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,మైనార్టీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి జి వినోద్ కుమార్ అన్నారు. స్టెప్ఇన్ లీడ్స్ అకాడమీ, ఐదోవ వార్షికోత్సవ వేడుకకు
ముఖ్యఅతిథిగా హాజరైన మేడ్చల్ జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిపారు.

అంతేకాకుండా జిఆర్ఈ, టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈ, డూయోలింగో తదితర అర్హత పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశీ విద్య పట్ల ఆసక్తి కలిగిన అభ్యర్థులకు స్టెపిన్ లీడ్స్ అకాడమీ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి నాణ్యమైన, మెరుగైన శిక్షణను సామాజిక సేవా దృక్పథంతో అందించటం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో స్టెఫెన్ లీడ్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్లు వంగూరి బ్రహ్మయ్య, ఉదయ్ కిరణ్ రెడ్డి పాల్గొన్నారు.