శాస్త్రీయ దృక్పథం లేని సమాజం అధోగతి పాలు

 

దేశానికి శాస్త్రీయ దృక్పథం అవసరం

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

శాస్త్రీయ దృక్పథం లేని సమాజం అధోగతి పాలవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

మంగళవారం స్థానిక మిర్యాలగూడలోని శివాని టెక్నో స్కూల్ యందు జరిగిన అల్లం కిరణ్ 15 వర్ధంతి సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశానికి శాస్త్రీయ దృక్పథం ఎంతో అవసరమని విద్యార్థులు ఆ వైపు పయనించాలని కోరారు.అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్సార్ కాత్యాయనితో పాటు పలువురు విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లం కిరణ్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కేతనపల్లి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు కవి విమర్శకులు అంబటి సురేందర్ రాజు, కార్టూనిస్టు శంకర్, మట్టి మనుషులు వేనేపల్లి పాండురంగరావు, తెలంగాణ విద్యావంతుల వేదిక అంబటి నాగయ్య, ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, వర ప్రసాదు, డాక్టర్ సాహితి, సాంబశివరావు, పుట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking