యువతకు స్ఫూర్తిప్రదాత ‘చింతరెడ్డి

యువతకు స్ఫూర్తిప్రదాత ‘చింతరెడ్డి’
* రైతు సమన్వయ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఏఎంసీ మాజీ చైర్మన్
* శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించిన యువనేత నల్లమోతు సిద్దార్ధ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

యువతకు స్ఫూర్తిప్రదాత చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ కొనియాడారు. రైతు సమన్వయ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన టీఆర్ఎస్ నాయకులు, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన నియామక పత్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని మిర్యాలగూడ పట్టణంలోని నివాసం వద్ద యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ నల్లమోతు సిద్దార్ధ అభినందనలు తెలిపే క్రమంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో చింతరెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. మిర్యాలగూడ మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి చింతరెడ్డి శ్రీనివాస్ నిర్వర్తిస్తోన్న కృషి ఎనలేనిదని అభినందించారు. మిర్యాలగూడ మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సేవనందించిన సమయంలో పార్టీ శ్రేణులను ఏకతాటిపై తెచ్చేందుకు, నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు చింతరెడ్డి నిర్వర్తించిన సేవలు ఇతర నాయకులకు అనుసరణీయమని అన్నారు. ఏఎంసీ చైర్మన్ గా పని చేసిన చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు రైతులకు, మిల్లర్లకు మధ్య సమన్వయం కుదుర్చడంలో సఫలీకృతులయ్యారని, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయాన్ని అధికంగా నమోదు చేసి రికార్డు సృషించారని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు సిద్దార్ధ వెంట మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ పాదూరి సంజీవ్ రెడ్డి, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, పూసపాటి రాజయ్య, బొమ్మరబోయిన రామారావు, తిరంశెట్టి కోటేశ్వరరావు, చిరుమామిళ్ళ వేణుగోపాల్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking