*దళితుడిపై దాడి చేసిన సర్పంచ్ అరెస్ట్..!!!*

*దళితుడిపై దాడి చేసిన సర్పంచ్ అరెస్ట్..!!!*

– ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు..

– కొర్టులో ప్రవెశ పెట్టిన పోలిసులు..

– సర్పంచ్ పదవి నుండి బర్తరఫ్ చేయాలని బీఎస్పీ డిమాండ్..

– ఫలించిన ప్రజా, కుల సంఘాల పోరాటం, అక్షిత న్యూస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బాధితులు…

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామంలో ఈనెల 4 తారీఖున దళితులపై సర్పంచ్ దాడి చేసిన ఘటన విధితమే.. దళితులపై సర్పంచ్ దాడిపై పలు ప్రజా, కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, అక్షితలో ప్రసారం కావడంతో ఎట్టకేలకు బాజకుంట సర్పంచ్ సరితరెడ్డి, ఇంద్రారెడ్డిని సోమవారం జిల్లా న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్ చేశారు పోలీసులు.

*అక్షితకి ప్రత్యేక ధన్యవాదాలు

తెలిపిన బాధితులు*

కుల అహంకారంతో దళితులు అంటే చులకన భావంతోనే మా గ్రామ సర్పంచ్ సరితరెడ్డి మా పై దాడి చేశారని, చట్టాలపై నమ్మకం లేకపోయినా, ఏ ఒక్క మీడియా ఛానల్లో మా సమస్యని వినిపించకపోయినా, వివిధ ప్రజా, కుల సంఘాల తో పాటు మా సమస్యను రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా ప్రసారం చేసిన అక్షిత న్యూస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

*అరెస్ట్ తో పాటు సర్పంచ్ పదవి

నుండి బర్తరఫ్ చేయాలి

దళితులపై దాడి చేసిన సర్పంచ్ సరిత రెడ్డి ని రిమాండ్ తో పాటు సర్పంచ్ పదవి నుండి బర్తరఫ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు, సరిత రెడ్డిని సర్పంచ్ పదవి నుండి తొలగించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ…
ఓట్ల కోసమే దళిత బంధు తెరమీదకు తెచ్చి, దళితులకు దళిత బంధు ఇస్తామంటూ, దళితులపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు, దళిత ముఖ్యమంత్రి నినాదం ఈ శతాబ్దపు ఘరానా మోసమని, టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారని మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking