అయ్యప్ప మహా పూజలో సిద్దార్థ

అయ్యప్ప మహా పూజ

పూజల్లో నలమోతు దంపతులు

మహా అన్న ప్రసాద వితరణ ముగింపు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నల్లమోతు భాస్కర్ రావు (ఎన్బీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ఆ సంస్థ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ఆధ్వర్యంలో గత 47 రోజుల నుంచి నిర్వహిస్తున్న మహా అన్నప్రసాద వితరణ ముగింపు కార్యక్రమం అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వర్లు నివాసం ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కాళీకా పూజ మహోత్సవంలో సతీసమేతంగా శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు.

అనంతరం అయ్యప్పస్వామి ఆలయ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అయ్యప్ప మహా మండల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, స్థానిక కౌన్సిలర్లు, ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking