మిషన్ భగీరథతో
ఇంటింటికి శుద్ధమైన జలాలు
భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి శుద్ధమైన జలాలను ప్రభుత్వం సరఫరా చేస్తోందని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని వార్డుల్లో 30 లక్షల మున్సిపల్ నిధులతో నీటి కుళాయిలకు అమర్చనున్న నియంత్రణ ట్యాప్ లను మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి నీటిబొట్టును ఒడిసిపెట్టి జాగ్రత్తగా వాడుకోవాలని, నీటిని వృథా చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, స్థానిక కౌన్సిలర్లు కుర్ర చైతన్య, జావిద్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, మున్సిపల్ డీఈ సాయిలక్ష్మి, వార్డు అధ్యక్షులు నూనే రవి కుమార్, పోగుల నవీన్, నాగుల్ మీరా, ఆలేటి వెంకన్న, కామాజి వెంకటేశ్వర్లు, సైదులు, కామాజి తిరుపతమ్మ, సయ్యద్ జానీ పాషా, మౌజం అలీ, హబీబ్, ఖలీల్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.