
మెడిసిన్ సాధించిన పేద విద్యార్థినికి ఆర్థిక చేయూతనివ్వడం అభినందనీయం
-జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం గోపాలపురంకి చెందిన మహమ్మద్ సబా అనే విద్యార్థిని కొత్తగూడెం మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. సభ తండ్రికి అనారోగ్యము, కళ్ళు కనిపించక ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. విషయం తెలుసుకున్న పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు వారి మిత్ర బృందం చావా రమేష్ బాబు జానకి బోస్ మద్దినేని ప్రసాదరావు వల్లభనేని వినోద్ తాళ్లూరి గోపాలరావు సుధాకర్ బిల్లా సురేష్ బాబు నరసింహారావు డి నాగేంద్రబాబు రమణారావు రామస్వామి చెరుకూరి కస్తూరిల ఆర్థిక సహకారంతో మహమ్మద్ సబాకు మొదటి సంవత్సరం కాలేజీకు కట్టవలసినటువంటి 30 వేల రూపాయల ట్యూషన్ ఫీజును జడ్పీఎస్ ఎస్ రోటరీ నగర్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ రోటరీ నగర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం మధు చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ విషయాన్ని స్వయంగా తెలుసుకొని ఆర్థిక సహకారం అందజేసిన వైవి మరియు వారి మిత్ర బృందానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు.ఎం మధు మాట్లాడుతూ మహ్మద్ సబా మెడిసిన్ పూర్తిచేసి కుటుంబాన్ని పోషిస్తూ పేదలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని కోరారు. ఆర్థిక సహకారం పొందిన మహమ్మద్ సబా మాట్లాడుతూ కుటుంబ పరిస్థితులు తెలుసుకొని స్వయంగా ఇంటికి వచ్చి ఆర్థిక సహకారం అందించిన పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యలమద్ది వెంకటేశ్వర్లు షాబుద్దీన్ పద్మ తాత రాఘవయ్య పాల్గొన్నారు.