
నేడు రియల్ అవార్డుల ప్రధానం
సినీ హీరో శ్రీకాంత్ రాక
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రియల్, వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సుమారు 25 మందికి రియల్ అవార్డుల ప్రదానం ఈనెల 21న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో జరుగనుంది.

రియల్ లైఫ్ టైం, ఐకాన్, యంగ్ అచీవర్, రియల్ పార్టనర్స్ షిప్, నిర్మాణ, ఫుడ్ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఆయా రంగాల్లో ఐకాన్ అవార్డులను రియల్ ప్రాపర్టీస్ అందించనుంది. గత ఏడాది కూడా అవార్డులను రాష్ట్ర ఎక్సైజ్ ప్రోహిబిషన్, క్రీడలు, యువజన వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్ గౌడ్, రియల్ దిగ్గజం, సినీ హీరో మురళీ మోహన్ ల చేతుల మీదుగా అందించగా ప్రస్తుతం సినీ హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా అవార్డులను అందించనున్నట్లు రియల్ ప్రాపర్టీస్ నిర్వాహకులు మురళీ కుమార్, మామిడిశెట్టి శ్రీనివాస్ గౌడ్, జనపరెడ్డి రవీందర్, దాస్ యం లు తెలిపారు. అవార్డుల ప్రదానంతో పాటుగా పాటలు, సాంస్కతిక ప్రదర్శనలు చేపట్టనున్నారు.