డబ్బా….. క్యారెక్టరా ?

డబ్బా….. క్యారెక్టరా ?

క్యారెక్టర్ పోతే… చరిత్ర శూన్యం

నమ్మకంతోనే…. భవిష్యత్

భూమిని నమ్ముకుంటే ప్రగతి

శ్రీమిత ఫౌండర్ ఎంవి చౌదరి,                  సినీ హీరో శ్రీకాంత్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఏ రంగంలోనైనా నమ్మకంతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని శ్రీమిత్ర టౌన్ షిఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, రియల్ ఎస్టేట్ లైఫ్ టైమ్ అవార్డు గ్రహిత ఎం.వి. చౌదరి అన్నారు.

బుధవారం హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో రియల్, వివిధ రంగాల్లో ప్రతిభ కనపర్చిన ప్రతిభావంతులకు రియల్ ప్రాపర్టీస్ అందించిన రియల్ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవానికి అతిధిగా హాజరై ప్రసంగించారు.

అంతా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో దాచుకున్న డబ్బుతో భూములు, ప్లాట్లు కొనుగోలు చేస్తారని, అలాంటి పరిస్థితుల్లో నమ్మకాన్ని వమ్ముచేయకుండా విశ్వస నీయతతో రియల్ వ్యాపారాన్ని సాగించాలన్నారు. కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తే క్యారెక్టర్ ను పోగొట్టుకుని చరిత్ర హీనులుగా మిగులుతారని హెచ్చరించారు.

రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేటప్పుడే భూమి రేట్, మార్కెటింగ్, పబ్లిసిటి తదితర ఖర్చులు పోను ప్లాట్ల ధరను కేటాయిస్తున్నప్పుడు మళ్లీ కస్టమర్లను మోసం చేయడం దేనికన్నారు. నమ్మకం…. సెంటిమెంట్ కు ప్రాధాన్యతనిచ్చి వ్యాపారాన్ని సాగించాలన్నారు.

సెంటిమెంట్ చాలా పవిత్రమైనదని, గుడి కన్నా ఇంట్లోనే సెంటిమెంట్ ఉంటుందని, నమ్మి వచ్చినోళ్లను నట్టేటా ముంచడం తగదన్నారు. ఇటీవల కాలంలో కొన్ని కంపెనీలను చూస్తున్నామని బోర్డులు తిప్పేస్తున్న వార్తలు విటుంటే హృదయ విదాకరమని పిస్తుందన్నారు. క్యారెక్టర్ పొతే చరిత్ర శూన్యమని,      బీ యువర్ సెల్ఫ్ …నువ్వు ఇష్టపడితే అంతా బాగుంటుందన్నారు. తన 33 ఏళ్ల రియల్ వ్యాపారంలోనూ రిటైర్డ్ అయ్యే వరకు కూడా చౌదరి వద్ద నేను నష్టపోయానని ఏ వ్యక్తి అన్నా….ఆ రోజు నుంచి వ్యాపారానికి ముగింపు పలుకుతానన్నారు.

అలాంటి పరిస్థితి ఎప్పటికి రానివ్వనని, కస్టమర్ల విశ్వసనీయతతోనే ఆయా కంపెనీల మనుగడ సాధ్యమన్నా రు. ఇన్వెస్టర్లను మినహాయిస్తే…. రియల్ రంగంలో ప్రవేశించిన ప్రతి వ్యక్తి జీరోగానే అరంగ్రేటం చేసి హీరోలుగా మారుతుండడం అభినందనీ యమన్నారు. తాను తొలుత జనచైతన్యలో మార్కెటింగ్ తన ప్రస్థానాన్ని ఆరంభించి 33 ఏళ్ల కిందట తొలి ప్లాట్ ను విక్రయించానన్నారు. 1994 డిసెంబర్ 5న ఇంద్రప్రస్థ వెంచర్ బంపర్ డ్రాకు ముఖ్య అతిధిగా సినీ హీరో శ్రీకాంత్ ను ఆహ్వానించామని… నాటి నుంచి మొదలిడిన మా ఇద్దరి పయనం ప్రతి వెంచర్ ఆరంభంలోనూ శ్రీకాంత్ హాజరుకావడం విశేషమన్నారు. ప్రపంచంలోనే రియల్ ఎస్టేట్ రంగం ప్రధాన భూమిక పోషిస్తుందని, ఆయా ప్రభుత్వాలకు సైతం అత్యధిక ఆదాయం రియల్ రంగం నుంచే వస్తుందన్నారు. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పరిశీలించినా…. 99.9 శాతం రియల్ ఎస్టేట్ ప్లాట్ల విక్రయాల నుంచే వస్తుందని, ఒక్కరో, ఇద్దరో వ్యక్తిగత భూ లావాదేవీలు చేపడుతారన్నారు. సినీ హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ భూములను నమ్ముకున్నోళ్లు ఎవరూ చెడిపోరని, భూమిని నమ్ముకుంటేనే ప్రగతి సాధ్యమన్నారు. భూములు నమ్ముకునోళ్లకు ఎప్పటికి నష్టం రాదన్నారు. డబ్బు కంటే పేరు గొప్పదని…చౌదరి ఆశ అని, తాను సినీ ఇండస్ట్రీలో అదే నమ్ముతానన్నారు. కస్టమర్ల సంతృప్తితో రియల్ వ్యాపారాన్ని సాగిస్తే… ఆయా కంపెనీలు మనుగడ సాగిస్తాయన్నారు. సినీ ఇండస్ట్రీలోనే అవార్డులుంటాయి…. వారిని ప్రొత్సహించేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

రియల్ ఎస్టేట్లోనూ అవార్డులను అందించడం అభినందనీయమన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయా కంపెనీల ప్రతినిధులకు అవార్డులను సినీ హీరో శ్రీకాంత్, శ్రీమిత్ర ఫౌండర్ ఎంవి చౌదరిల చేతుల మీదుగా అందజేశారు. గాయకులు చక్కటి పాటలతో సభికులను ఆనందింపచేశారు. ఆర్ జే గ్రూప్ ప్రధాన స్పాన్సర్ వ్యవహరించగా టిఎంఆర్, పారిజాత హోమ్స్ అండ్ డెవలప ర్స్, ఎంపిసిఏ, రియల్ స్టార్స్ టీమ్, ప్రైమ్ 9, అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక, మరో ప్రస్థానం మాసపత్రికల ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ అవార్డుల ప్రధానోత్సవ ప్రక్రియ చేపట్టారు. శ్రీమిత్ర ఫౌండర్ ఎంవి చౌదరి, ఆర్ జే గ్రూప్ లక్ష్మి, టిఎంఆర్ మోహన్ రెడ్డి, పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్
డైరెక్టర్స్ టి. నరేష్ కుమార్, టి.శ్రీధర్, రియల్ విజన్ గౌరిపతిరావు యాళ్ల, పళ్లవి సుధ డాక్టర్ టివి రావు, డిఇ వన్ ఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహరి రాజు, ఎం.సీతారామారాజు, రాజా ఇన్ ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు, గూగి జి. సురేంద్రకుమార్, విఆర్ కే ప్రాపర్టీస్ కృష్ణ కిషోర్ వీరమళ్ల తదితరులు రియల్ ఐకాన్, రియల్ ఐకాన్ యంగ్ అచీవర్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ప్రాపర్టీస్ నిర్వహకులు ఎం.మురళీకుమార్, మామిడిశెట్టి శ్రీనివాస్ గౌడ్, జనపరెడ్డి రవీందర్, దాస్ మాతంగి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking