రాజుకు అభినందల వెల్లువ
మళ్ళీ యంగ్ అచీవర్ అవార్డు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రియల్ రంగంలో విశిష్ఠ సేవలందించిన ప్రతిభావంతులకు అందించిన అవార్డుల్లో రియల్ ఐకాన్ యంగ్ అచీవర్ అవార్డును రాజా ఇన్ ఫ్రా
డెవలపర్స్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు అవార్డును అందుకోవడం అభినందనీయమని అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్ మాతంగి అన్నారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో సినీ హీరో శ్రీకాంత్, శ్రీ మిత్ర ఫౌండర్ ఎం వి చౌదరిల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారన్నారు. రియల్ రంగంలో
గత పదిహేనేళ్ల చేరువలో మరో మైలు రాయిని దాటారాన్నారు.

ఎంత దూరం పయనమైనా తొలి అడుగుతోనే ఆరంభమని, రియల్ రంగంలో ఓనమాలు తెలియని స్థితిలో ఎగ్జిక్యూటివ్ గా అరంగ్రేటం చేసి…నాటి కష్టాలు…కడగండ్లను అధిగమించి…ఓ సంస్థకు అధిపతిగా ఎదిగిండన్నారు. నేనొక దుర్గం…నాదొక స్వర్గం… అనితర సాధ్యం నా మార్గమని మహాకవి అన్నట్లు రాజు జీవన పయనం అనితర సాధ్యమని ముందుకు సాగుతున్నారు. లక్ష్యం… గమ్యం ముద్దాడాలనే ఆశయం… కసి… పట్టుదల అతనిని ఉన్నత స్థాయికి చేర్చిందన్నారు. అతని సంకల్పం ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయించి రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజును రాజా ది గ్రేట్ గా మలచిందని, ఇంతితై వటుడింతై అన్న చందంగా ఎదిగిన తీరు… గత స్థితిగతులు తన మస్తిష్కంలో పదిలపర్చుకొండ్రు. అట్టడుగు నుంచి ఉన్నత స్థాయికి చేరుకుని రియల్ రంగంలో రారాజుగా విలసిల్లుతుండ్రు.

తొలుత డ్రీమ్ రియాల్టీ అసోసియేట్స్ గా విత్తిన విత్తు రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ గా రూపుదిద్దుకుంది. అందరూ బాగుండాలి…అందులో నేనుండాలనే దృఢసంకల్పం అతని సొంతం. వయస్సు చిన్నదేనైనా రియల్ మార్కెటింగ్ లో తనకున్న అపార అనుభవం పదుల, వందల, వేలాది మంది కస్టమర్ లను, మార్కెటింగ్ మిత్రులకు చేరువయ్యారు. నాడు ఉన్న ఊరును వదిలి బతుకుదెరువు ఉద్యోగంకై పట్నం బాట పట్టి ప్రస్తుత స్థితితో ఎస్ ఎస్ రాజు తనను కన్న తన తలిదండ్రుల కళ్ళలో ఆనందం చూశారు. తన వ్యాపార పయనంలో తనతో పాటు పయనిస్తున్న తన టీంను దృఢసంకల్పంతో దిగ్విజయంగా ముందుకు నడిపిస్తుండ్రు. లక్ష్యాన్ని సాధించడానికి తాను కన్న కలలను సాకారం చేసుకొంటున్న మహోన్నత దీశాలి ఎస్ ఎస్ రాజు. అంధకారాన్ని అధిగమించి వెలుగు రేఖలను విరజిమ్ముతూ తన కలల సౌధమైన రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ ను దివ్యకాంతులతో ప్రసరింప చేస్తుండ్రు. తాను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రేమిస్తూ అనేకమంది జీవించడానికి ఒక మహర్షిల జీవిస్తున్నారు. తన కలల సామ్రాజ్యం రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ ను నలుదిశల విస్తరింప చేస్తూ ఎంతోమంది యువత బంగారు భవితకు బాటలు వేస్తుండ్రు.

ఓ యువకుడిగా రియల్ రంగంలో వేలాదిమంది కస్టమర్లకు విశిష్ట సేవలందించడంతో రియల్ ప్రాపర్టీస్ 2021అప్పటి డ్రీమ్ రియాలిటీ అసోసియేట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజుకు రియల్ యంగ్ అచీవర్ అవార్డ్ కు ఎంపిక చేసి రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్, క్రీడలు, యువజన వ్యవహారాలు,
పర్యాటకం, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్, రియల్ దిగ్గజం, రియల్ ఐకాన్
లైఫ్ టైం అచీవర్, సినీ హీరో మురళీ మోహన్ ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారని, 2022లోనూ 2వ పర్యాయం రియల్ యంగ్ అచీవర్ అవార్డ్ కు ఎంపికై సినీ హీరో శ్రీకాంత్, శ్రీమిత్ర ఫౌండర్ ఎం వి చౌదరిల చేతుల మీదుగా అవార్డును అందుకోవడం అభినందనీయమన్నారు. పలువురు మార్కెటింగ్ అసోసియేట్స్, మిత్రులు, శ్రేయోభిలాషులు రాజును అభినందించారు.మరిన్ని అవార్డులతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.