శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో 25న మహా మండల పడిపూజ
– 
– ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు గుప్త
చేర్యాల,డిసెంబరు 21అక్షిత న్యూస్: మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నేల 25న సాయత్రం 7 గంటలకు మహా మండల పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తాటిపల్లి ఆంజనేయులు గుప్త తెలిపారు.కాగా ఆలయంలో 6వ మహా మండల పడిపూజ పురస్కరించుకుని18 కలశాలకు పూజలు చేసి సుగంద్ర ద్రవ్యాలతో దివ్య పదునెట్టంబడి18 మెట్లపై కర్పూర హారతిని వెలిగించనున్నట్లు పేర్కొన్నారు.కాగా అప్పయ్య స్వామి సామూహిక మహా పడిపూజ కార్యక్రమాన్ని బ్రహ్మ శ్రీ పాలెం మనోహర శర్మ (చండి ఉపాసకులు) గురు స్వామి నేతృత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లును పూర్తి చేస్తున్నామని ఆంజనేయులు గుప్త అన్నారు.ఈమహా పడిపూజకు అయ్యప్ప స్వాములు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ మహా మండల పడిపూజ అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గురు స్వాములు అల్లాడి జగదీశ్వర్ గుప్త,ఉట్లపల్లి శ్రీనివాస్, పబ్బోజు క్రిష్టప్ప,చికొటి విజయ్ గుప్త,అంబాల శ్రీనివాస్ గౌడ్,కత్తుల మాధవ రెడ్డి, బద్దిపడిగ నర్సింహా రెడ్డి,డా”కుర్రే మనోహర్,అక్కెనపల్లి కామేశ్వర్ రెడ్డి,బర్రె అమరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.