
పేదలకు దుప్పట్లు పంపిణీ
చేర్యాల, అక్షిత ప్రతినిధి :
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని ప్రైమరీ మరియు హైస్కూల్ విద్యార్థులకు, క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఉపాధ్యాయులు అందే విజయ్ కుమార్ సహకారంతో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, డ్రైఈగ్ బుక్స్, మరియు స్కూల్ వంట కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా హెచ్ఎం సుమలత మాట్లాడుతూ విద్యార్థులకు మరియు వంట కార్మికులకు తన వంతు సహాయం చేసినందున, స్కూల్ తరఫున విజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యానందు,సిద్ధిరాములు, తిరుపతి,రజనీష్, అనిల్, సమత, శారద తదితరులు పాల్గొన్నారు.