
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
అధికారులకు కొప్పుల ఆదేశం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి:
సాంఘిక సంక్షేమ, మైనారిటీస్ సంక్షేమ శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులతో గురువారం నాడు తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలు పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సంబంధించిన కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న షాదీ ఖానాల పూర్తిని చేపట్టాలన్నారు. ఎస్సి కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని..ఇందుకు శాఖపరంగా అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ సంక్షేమ శాఖా కార్యదర్శి మహామ్మద్ నాదీమ్, డైరెక్టర్ షన్వాజ్ ఖాసీం, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ఉమాదేవి, విజయకుమార్ పాల్గొన్నారు.