*ఎన్ బిఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

*ఎన్ బిఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం*

అక్షిత ప్రతినిధి, వేములపల్లి : మిర్యాలగూడ నియోజకవర్గంలోని పేద ప్రజలకు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తనయుడు యువనేత నల్లమోతు సిద్దార్ధ నేతృత్వంలో ఎన్ బిఆర్ ఫౌండేషన్ అధ్వర్యంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని లక్ష్మీదేవిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ చేర్కుపల్లి కృష్ణవేణిసుమన్ అన్నారు. గురువారం వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని తాళ్లగడ్డ గ్రామానికి చెందిన వలంపట్ల వెంకటమ్మ మృతి చెందడం జరిగింది. గ్రామ సర్పంచ్ చెరుకుపల్లి కృష్ణవేణి సుమన్ ద్వారా విషయం తెలుసుకున్న ఎన్ బిఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ నల్లమోతు సిద్దార్ధ మృతురాలి అంత్యక్రియలకు హాజరైన బంధు మిత్రులు, స్థానికులు 200 మందికి సరిపడ భోజనం ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో స్థానిక భారతీయ రాష్ట్ర సమితి నాయకలు,ఎన్ బిఆర్ ఫౌండేషన్సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking