ఇండ్ల స్థలాలకై జర్నలిస్టుల ధర్నా…

ఇండ్ల స్థలాలకై
జర్నలిస్టుల ధర్నా…

* ఆర్డీవోకు వినతి
* ధర్నాకు పలు పార్టీలు, సంఘాలు మద్దతు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు మంద సైదులు జయరాజుల ఆధ్వర్యంలో సోమవారం ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆర్డిఓ చెన్నయ్య కు వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాకు సిపిఎం, సిపిఐ, ఏఐఎఫ్బి, ఎంఐఎం పార్టీలు, బీసీ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఆయూబ్, గౌరవ అధ్యక్షులు ఖాజా హామీదోద్దిన్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. వెంకన్న, మనోజ్ మహేష్ లు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఆ తీర్పుకు అనుగుణంగా గ్రామీణ విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి వెంటనే జర్నలిస్టులకు పంపిణీ చేయాలని కోరారు. జర్నలిస్టులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేయాలని ఆ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆపదలో కష్టాల్లో ఉన్న జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనుకోని సంఘటన జరిగిన తర్వాత జర్నలిస్టుల కుటుంబాలకు ఆది సాయం అందజేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులపై జరిగే దాడులు అరికట్టాలని, ప్రజా ప్రతినిధులు అధికారుల బెదిరింపులు మానుకోవాలని కోరారు. వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

పలు పార్టీలు ప్రజా సంఘం నాయకులు మద్దతు

జర్నలిస్టులు చేపట్టిన ధర్నాకు పలు పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళనకు సంఘీభావం తెలిపి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు చేసే ఆందోళనకు తమ పార్టీలు, సంఘాలు పూర్తిగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఏఐఎఫ్బి జిల్లా నాయకులు పరంగి రాము, ఎంఐఎం జిల్లా నాయకులు ఫారుక్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగం గౌడ్, బంటు వెంకటేశ్వర్లు, మహేష్ గౌడ్, పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking