శీతాకాల విడిదికై రాష్ట్రపతి రాక

 

శీతాకాల విడిదికై…ముర్ము రాక

సీఎం కేసిఆర్ ఘన స్వాగతం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము గారికి సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను, అధికారులను పేరుపేరునా రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తోపాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కె.టి.రామారావు, టి.హరీశ్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జి.జగదీష్ రెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, సీహెచ్.మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత కె.కేశవరావు, లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, పలు శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొని, రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులందరూ రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలకడంతో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సందడి నెలకొన్నది.

Leave A Reply

Your email address will not be published.

Breaking