ముర్ముకు ఘన స్వాగతం పలికిన భాస్కర్ రావు 

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఘన స్వాగతం పలికిన భాస్కర్ రావు 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరంలోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సోమవారం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అంతకుముందు భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking