మంత్రి పువ్వాడకు రుణపడి ఉంటాం

మంత్రి పువ్వాడకు రుణపడి ఉంటాం

— జర్నలిస్టుల బలమైన సంఘంగా టీజేఎఫ్

— టియుడబ్ల్యూజే పూర్తిస్థాయి జిల్లా కమిటీల ఎంపిక

— జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ

ఖమ్మం/అక్షిత బ్యూరో :

జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ప్రకటించి రోల్ మోడల్ గా నిలుస్తానని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చేతులు మీదుగా పట్టాలు పంపిణీ చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించడం పట్ల జర్నలిస్టులుగా తమ రుణం తీర్చుకుంటామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు. ఖమ్మం నగరంలోని శ్రీ కవిత డిగ్రీ పీజీ కళాశాలలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా యూనియన్ కార్యవర్గ సమావేశంలో ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాభివృద్ధి కాంక్షించి ప్రభుత్వ సహకారంతో మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ సారధ్యంలో అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు తీసుకురావడమే కాకుండా కరోనా వంటి విపత్కర పరిస్థితులలో జర్నలిస్టులకు అండగా నిలిచింది తమ సంఘమేనని ఉద్ఘాటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జర్నలిస్టుల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం రోల్ మోడల్ గా ఉంటానని హామీ ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.మంత్రి హామీతో జర్నలిస్టులకు చిరకాల స్వప్నమైన ఇండ్లు ఇళ్ల స్థలాలు త్వరలోనే రాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. తమ సంఘం ఎంతో శ్రమించి జర్నలిస్టుల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే కొన్ని శక్తులు అడ్డుపడుతూ జర్నలిస్టుల నోట్లో మట్టి కొట్టేలా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇండ్లు ఇళ్ల స్థలాలు వచ్చే క్రమంలో కుటిల యత్నాలు చేస్తూ రాకుండా అడ్డుకోవడాన్ని జర్నలిస్టుల లోకం గుర్తించాలని అన్నారు.గత 20 ఏండ్లుగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో తిష్టవేసి ఎటువంటి అభివృద్ధి చేయకుండా శిథిలావస్థకు చేరేలా చేయడమే కాకుండా జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడకుండా ప్రెస్ క్లబ్ వ్యవస్థను దిగజార్చేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాసభకు జర్నలిస్టులు పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చారని, ఈ సభలోనే మంత్రి అజయ్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు 40 లక్షల నిధులు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కేటాయిస్తే దానిని చూసి ఓర్వలేక కొన్ని శక్తులు అడ్డుపడుతూ జర్నలిస్టుల నోటికాడ కూడును చెడగొడుతున్నారని వివాదాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.ప్రెస్ క్లబ్ చరిత్రలో ఏ రోజు కూడా తాళాలు వేసిన ఘటన లేదని ప్రెస్ క్లబ్ కు తాళాలు వేసి అడ్డదారిలో అరాచకాలు చేయడం వారికే తగిందని దుయ్యపట్టారు.జర్నలిస్టులు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని తమ సంఘం ఏనాడు కూడా యాత్రల పేరుతో తిరగలేదని విమర్శించారు. శిధిలావస్థలో ఉన్న ప్రెస్ క్లబ్ ను తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటున్నామని తెలిపారు.ఎన్ని అడ్డంకులు సృష్టించిన జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధి కోసం వెనకకు తగ్గేదే లేదని పేర్కొన్నారు.

*జిల్లా పూర్తిస్థాయి నూతన కమిటీల ఎన్నిక*

ఈ సమావేశంలో టియుడబ్ల్యూ టిజేఎఫ్ జిల్లా నూతన కమిటీ అదే విధంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రివంగా ఎన్నుకోన్నారు.

జిల్లా అధ్యక్షులుగా ఆకుతోట ఆదినారాయణ ప్రధాన కార్యదర్శిగా చిర్రా రవి కోశాధికారిగా తోట కిరణ్ ఉపాధ్యక్షులుగా వెన్నబోయిన సాంబశివరావు బొల్లం శ్రీనివాస్ ప్రశాంత్ రెడ్డి హరీష్ బాబు రాంశెట్టి విజేత టీఎస్ చక్రవర్తి పిన్ని సత్యనారాయణ కె నాగార్జున
సహాయ కార్యదర్శులుగా సత్యనారాయణ, వెంకటాచారి, వెంకన్న, పోలిశెట్టి రాములు, పాశం వెంకటేశ్వర్లు, ఉత్కంఠం శ్రీనివాస్, మీడియా సెల్ ఇన్చార్జిగా తిరుపతిరావు, ఈసీ సభ్యులుగా సయ్యద్ ఖాసీం (అక్షిత దినపత్రిక బ్యూరో ),తోట గణేష్, గడల నరసింహారావు, సయ్యద్ అంజద్, సంతోష్, ఆజాద్, అహ్మద్, వేణుగోపాల్, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 


*ఈసీ మెంబర్ గా ఖాసీం*
టియుడబ్ల్యూ (టిజేఎఫ్) జిల్లా కమిటిలో ఈసి మెంబర్ గా అక్షిత దినపత్రిక బ్యూరో షేక్ సయ్యద్ ఖాసీం కు అవకాశం కల్పించారు.ఈ సందర్బంగా ఖాసీం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి జిల్లా కమిటిలో స్థానం కల్పించిన యూనియన్ జిల్లా అధ్యక్షులుగా ఆకుతోట ఆదినారాయణ ప్రధాన కార్యదర్శిగా చిర్రా రవి లకు కృతఙ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking