ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. యేసు క్రీస్తు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని , ప్రేమ, దయ ,శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనలు ప్రజలందరికి సదా ఆచరణీయం అని,. యేసుక్రీస్తు మహిమలను, మార్గాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ధవకా నాలో రోగులకు, సిబ్బందికి పండ్లు పంపిణి చేశారు
ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.