అపూర్వ కలయిక

గుర్తుకొస్తున్నాయి…

జ్ఞాపకాల దొంతర

అపూర్వ కలయిక

 

స్నేహ బంధం… పాతికేళ్ళ పయనం. అది 1993-1996 కాలం…26 ఏళ్లకు చేరువైంది. ఇంటర్ విద్యను ముగించుకొని డిగ్రీ విద్యకై మిర్యాలగూడ పట్టణంలోని పేరెన్నిక గల కొండూరు నర్సయ్య మెమోరియల్ ( కెఎన్ ఎం)లో ప్రవేశించారు. యవ్వన దశ. ఇక్కడ గండం గట్టెక్కితే ఇక ఉన్నత చదువులపై దృష్టి సారించొచ్చు. ఆడుతూ పాడుతూ కామర్స్ మూడేళ్ల విద్యను ఎలాగోలా ముగించుకుండ్రు. ఇక డిగ్రీ చదువులు ముగించుకొని ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు చెల్లా చెదురుగా వెళ్లారు.

కొంతమంది ఉన్నత చదువులకై ఖండాంతరాల్లోకి… మరికొంత మంది వ్యాపార, వాణిజ్య రంగాల్లో ప్రవేశించడం… ఇంకొంత మంది పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబ భారాన్ని ఎత్తుకుండ్రు. చూస్తుండగానే 26 వసంతాలు గడిచిపోయాయి. ఇక ఉన్న 80 మందిలో  ఓ మిత్రుడికి వచ్చిన మంచి ఆలోచన అందరిని మళ్లీ  ఓ చోటకు చేర్చింది. అదే కేఎన్ ఎం 26 ఏళ్ల 93-96 విద్యార్థిని, విద్యార్థుల పండుగ… అపూర్వ కలయిక. ఎక్కడో మిర్యాలగూడ పట్టణంలోని కొండూరు నర్సయ్య మెమోరియల్ ( కెఎన్ ఎం) డిగ్రీ కళాశాలలో చదివినప్పటికి అందరి సౌలభ్యం కోసం హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలో గల డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ అపూర్వ కలయికకు వేదికైంది. అందరూ కలిసి నాటి గురువులు లక్ష్మీనారాయణ సర్, రవీందర్ సర్ తదితర పాతికేళ్ల జ్ఞాపకాల దొంతరను నెమర వేసుకుండ్రు.

వివిధ రంగాల్లో… వివిధ స్థాయిల్లో ఉన్న సుమారు 32 మంది నాటి స్నేహితులు, స్నేహితురాళ్ళు అంతా కలుసుకుండ్రు. అందరి యోగ క్షేమాలు తెలుసుకుండ్రు. ఉపాధ్యాయ, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇప్పటికే స్థిరపడి ఉన్న తీరు… కుటుంబాలు… పిల్లల చదువులు తదితర అంశాలను ఒకరి కొకరు పంచుకుండ్రు.  ఆడుతూ, పాడుతూ హాయిగా గడిపారు. కాసేపు కుటుంబం, పిల్లలు..  బరువు బాధ్యతలు అన్నీ మర్చిపోయారు. అందరూ బాల్యం… యవ్వన దశలో ఆడిన, పాడిన… చదివిన తదితర అంశాల జ్ఞాపకాలను జ్ఞాపకాల మదిలో మెదుల్చుకుండ్రు.

డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ లోకి ఉదయం ప్రవేశించి సాయంత్రం వరకు హాయిగా సంతోషంగా గడిపారు. ఆనందోత్సవాలతో తెగ ఎంజాయ్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ మొదలుకొని లంచ్… స్నాక్స్ ముగించుకొని చెట్టు పుట్టల నడుమ ఫోటోలు, వీడియోలు దిగి చేపట్టిన సంబరాలు అంబరాన్ని అంటాయి. చిట్ట చివరకు వెళ్ళే సమయంలో తీరని వ్యధతో ఆ ప్రాంగణాన్ని వదిలి వెళ్లారు. ఎవరూ ఏ స్థాయిలో ఉన్నా… మళ్లీ మళ్లీ కలుస్తూ స్నేహాన్ని పదిలంగా ఉంచుకుంటూ…Student Life  is Golden Life…ఈ స్నేహ బంధం పవిత్ర బంధంగా ఎల్లప్పుడూ కలకాలం నిలిచి ఉండాలి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking