
క్రిస్మస్ వేడుకలు
చేర్యాల, అక్షిత ప్రతినిధి :
క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆదివారం చేర్యాల మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రార్థన మందిరాలలో పాస్టర్లు, భక్తులు కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోగా, మండల కేంద్రంలోని షాలేం ప్రార్ధన మందిరంలొ సంఘ సేవకులు అందే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలో భాగంగా,ఈ ప్రార్థన మందిరంలో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని, ప్రార్థనలు, పాటలు, స్కిట్స్ తోపాటు కేక్ కట్ చేయడం లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో సుమారు150 మంది భక్తులు, పిల్లలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.