పశువుల పాకలో జనియించిన క్రీస్తు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
చాలా మందికి క్రిస్మస్ అంటే పశువుల పాకలో బాలయేసు అని మాత్రమే తెలుసు. అయితే యేసు జనము ప్రత్యేకమైనదని గాని, మానవ చరిత్రలో జరిగిన అద్భుత సంఘటన అని కానీ గ్రహించరు. వాస్తవానికి దేవుడే క్రిస్మస్ శిశువు అయ్యాడు అనేది క్రిస్మస్ నేపధ్యంలో నిండియున్న నిగూఢ సత్యం.
పశువుల శాలలో దేవుడు (God in a Manger):
క్రిస్మస్ అనేది రక్షకుని బాల్యానికి సంబంధించింది కాదు; అది ఆయన దైవత్వానికి సంబంధించినది. యేసు క్రీస్తు యొక్క దీన జననం ఈ లోకంలోకి దేవుని రాకగా భావించాలి గానీ గర్భములో పుట్టిన వానిగా చూడకూడదు. సాధారణ గర్భం లో పుట్టిన శిశువు గానే నేటి ఆధునిక ప్రపంచం భావిస్తుంది. ఇలా ఎంచడం వలన మానవ జాతి క్రిస్మస్ ఏమాత్రం ప్రయోజనం లేనిదిగా మిగిలిపోతుంది.

దేవుడు పశువుల పాకలో పుట్టడం అనేది చాలా మందికి జీర్ణం కాని విషయం. సర్వశక్తిమంతుడు,మహోన్నతుడైన దేవుడుశిశువు గా పుట్టడం అసాధ్యమేమి కాదు కదా. అయితే దేవుడు మానవ అవతారిగా రావలసిన అవసరత గురించి ఆలోచించే అంత తీరిక ఉండటం లేదు.
దేవుడు శిశువు గా పుట్టడం ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి. ఆయన తన దైవత్వ స్వభావాన్ని విడువలేదు. ఈ చిన్న ప్రపంచంలో చిన్న శిశువు గా జన్మించాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా పుట్టాడు.మానవులు కలిగి ఉండే అన్ని భావోద్వేగాలను కలిగి సాధారణ మనవులందరికి ఉండే అవసరతలు కలిగి జీవించాడు.
సుమారు 2019 సంవత్సరాలుగా యేసు ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా ఉంది. సాంప్రదాయ వాదులు (Cult), సంశయవాదులు (Skeptics) రకరకాలుగా తమ వాదనలు వినిపిస్తున్నారు.
అనేక మంది దేవుళ్ల లో యేసు కూడా ఒకడని (He is one of many gods), ఆయన సృజించ బడినవాడని (a created being), ప్రధాన దూత అని( a high angel), మంచి బోధకుడు అని(a good teacher), ప్రవక్త (a prophet), అని ఇంకా అనేక రీతులుగా తమ వాదనలలో దేవుని కంటే తక్కువ వాడని చెప్ప సహసం చేయుచున్నారు. అయితే పశువుల పాకలో పుట్టిన శిశువు దేవుని అవతారం అని బైబిల్ నొక్కి వక్కాణిస్తుంది.
అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఒక భాగం లో యేసు యొక్క దైవత్వ స్వభావాన్ని స్పష్టంగా వివరిస్తూ క్రిస్మస్ లోని అద్భుత సత్యాన్ని ఆవిష్కరిస్తాడు.
*అదృశ్య దేవుని స్వరూపం:*
కొలసి 1:15-20
“ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు.
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు,
ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.”
1. ఇది జ్ఞాన వాద భ్రాంతి? (A Ghostly Illusion?)
పౌలు కొలసి సంఘాన్ని ఉద్దేశించి ఈ మాటలు వ్రాస్తున్నాడు.అప్పటికి కొలసి పట్టణం జ్ఞానవాదం (జ్ఞాస్టిసిజం -gnosticism) అని పిలువబడే మేధోమధనంతో నిండి ఉంది. నిజ నిర్దారణ లో మేమే అందెవేసిన వారమని నమ్మే వారు. వారి మేధస్సు ను సామాన్యులు అర్దం చేసుకోలేరనే అభిప్రాయం లో కొలసి ప్రజలు ఉండేవారు. అన్నిటి కంటే ఎక్కువగా ద్వైత తాత్వికం (philosophical dualism) అనగా పదార్ధం(matter) చెడ్డది, ఆత్మ (spirit) మంచిది కావున దేవుడు మంచి వాడు గనుక పదార్ద సంబడమైన శరీరం అనగా పాప భూయిష్టమైన దానియందు దేవుడు ఉండడు. అని నమ్మేవారు
అందువలన ఈ భౌతిక విశ్వాన్ని దేవుడు సృజించ లేదు. ఒకవేళ దేవుడే ఈ విశ్వాన్ని చేసునట్లైతే ఇందులోని చెడు(పాపం) అంతటికీ దేవుడే బాధ్యత వహించాలి. కాబట్టి దేవుడు మానవుడిగా ఈ పాప శరీరమందు పుట్టుట అసాధ్యం అని కొలసి ప్రజల నమ్మకం.
ఈ జ్ఞానాధార జ్ఞాస్తిక వాదులు యేసు యొక్క మానవ అవతారాన్ని ఒప్పుకోవడం లేదు పైగా యేసు క్రీస్తు శరీరం మాయస్వరూపం అని ఆయన ఒక దేవుని మంచి దూత అని వివరించడం మొదలు పెట్టారు. నాడు ఇలాటి భోదలు ఆదిమ సంఘంలో అనేకం వ్యాపించాయి. క్రొత్త నిబంధన పత్రికల్లో ఎక్కువ శాతం ఈ జ్ఞాస్టిసిజం ని ఎదిరించడానికే వ్రాయబడినవి. వాస్తవానికి అపొస్తలుడైన యోహాను ఈ జ్ఞాస్తిక జ్ఞానవాదాన్ని ఆదిలోనే ఎదిరించాడు.
“యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది;” 1యోహాను 4:2
ఇదే విమతాన్ని అపో పౌలు కూడా ఖండించాడు
“ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను”. కొలస్సీయులకు 1:16
యేసు శరీదారి అయిన దేవుడు అని సమస్తమును సృజించిన సృష్టి కర్త యని పౌలు ఖచ్చితముగా తెలియజేశాడు.
2. తండ్రి వంటి కుమారుడు (Like Father, Like Son)
ఆయా విశ్వసాలకు చెందిన కొందరు యేసు దైవత్వాన్ని నిరాకరుస్తున్నారు అనేది నిజం. వాళ్ళు కొలస్సి 1:15,20 లోని “అదృశ్య దేవుని స్వరూపి” అనే మాటను వారు ఆధారం చేసుకుని ఈ వాదన చేస్తుంటారు. సమస్త మానవులు దేవుని పొలికలో సృజింపబడినట్టుగా నే యేసుకుడా సృజింప బడేనని వీరి వాదన. అయితే వాస్తవాన్ని గమనిస్తే మనం దేవుని “పొలికలో” సృజించ బడినవారము, యేసు “దేవునిస్వరూపి” .
“స్వరూపం” అని అనువదించబడిన గ్రీకు పదానికి పరిపూర్ణ ప్రతిరూపం, ఖచ్చితమైన ప్రతిరూపం, నకలు అని అర్థం.
యేసుక్రీస్తు తప్ప మరెవరో కాదు, తన కుమారుని వ్యక్తిత్వంలో దేవుడే పూర్తిగా ప్రత్యక్షమయ్యాడని పౌలు చెప్పాడు. ఆయన దేవుని యొక్క ఖచ్చితమైన ప్రతిరూపం. “నన్ను చూచినవాడు తండ్రిని చూచెను” (యోహాను 14:9) అని యేసు స్వయంగా చెప్పాడు.
హెబ్రీయులు 1వ అధ్యాయం కొలొస్సయులు 1:15-20కి అనేక కీలకాంశాలలో సమాంతరంగా ఉంటుంది.
క్రీస్తు దేవుని స్వరూపం అనే ప్రకటనకు సంబంధించి, ఉదాహరణకు, హెబ్రీయులు 1:3 ఒకేలా ధృవీకరణ చేస్తుంది: “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయున్నది”
కాంతి యొక్క వెచ్చని ప్రకాశం సూర్యునికి ఉన్నట్లే క్రీస్తు దేవుని వ్యక్తిత్వ ప్రకాశమై యున్నాడు
ఆయన దేవుని సర్వజనీత నుండి మనుషుల హృదయాలలోకి దానిని తీసుకువస్తాడు.
ఆయన జీవపు వెలుగును మరియు దేవుని సారాంశాన్ని వెల్లడి చేస్తాడు. అవి విభజించబడవు మరియు ఒకటి లేకుండా మరొకటి ఎప్పుడూ ఉనికిలో లేవు
– అవి ఒకటి (యోహాను 10:30).
*దేవుడు అదృశ్యుడని* లేఖనాలు పదే పదే చెబుతున్నాయి (యోహాను 1:18; 5:37; 1 తిమోతి 1:17; మరియు కొలస్సీ 1:15).
కానీ క్రీస్తు ద్వారా కనిపించని దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
దేవుని పూర్తి పోలిక ఆయనలో వెల్లడి చేయబడింది.
కొలొస్సయులు 1:19 సత్యాన్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళుతుంది: పూర్తిగా ఆయనలో నివసించడం తండ్రికి సంతోషం. “ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు,”
యేసు కేవలం దేవుని రూపురేఖలు మాత్రమే కాదు;
ఆయన పూర్తిగా దేవుడు.
కొలొస్సియన్లు 2:9 మరింత స్పష్టంగా ఉంది:
“ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;”
దేనికీ లోటు లేదు. ఏ లక్షణమూ కొదువ కాలేదు. సంపూర్ణంగా గ్రహించగల దేవుడు, యేసు దేవుని పరిపూర్ణ స్వరూపం. సరైన వారసుడు
కొలొస్సయులు 1:15లో పౌలు యేసు “సమస్త సృష్టికి మొదటివాడు” అని చెప్పాడు.
క్రీస్తు దేవత్వమును తిరస్కరించే వారు దీని అర్థాన్ని మార్చేస్తుంటారు.యేసు సృష్టించబడిన జీవి అని భావిస్తారు.
కానీ “ఆది సంభూతుడు” అని అనువదించబడిన పదం యేసు యొక్క స్థాయిని వివరిస్తుంది, ఆయన మూలాన్ని కాదు.
*జ్యేష్టుడు:*
హీబ్రూ కుటుంబంలో మొదట జన్మించిన వ్యక్తి వారసుడు, ర్యాంకింగ్ పొందినవాడు, వారసత్వ హక్కు ఉన్నవాడు.
మరియు రాజకుటుంబంలో, అతనికి పాలించే హక్కు ఉంది.కాబట్టి సమస్త సృష్టిని మరియు దానిని పరిపాలించే హక్కును వారసత్వంగా పొందినవాడు క్రీస్తు. అతను క్రమంలో మొదట జన్మించాడని దీని అర్థం కాదు, ఎందుకంటే ఈ వాక్యం అతని గురించి కాదు.
కీర్తన 89:27లో దేవుడు దావీదు గురించి ఇలా చెప్పాడు, “కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను”.
అక్కడ “జ్యేష్టుడు” అనే అర్థం సాదారణ భాషలో ఇవ్వబడింది: “భూమిలోని రాజులలో అత్యున్నతుడు.”
మొదటి సంతానం అంటే అదే – క్రీస్తు “రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభువు” (ప్రకటన 17:16).
హెబ్రీ 1వ అధ్యాయం మళ్ళీ సమాంతర ప్రకటనను కలిగి ఉంది. దేవుడు తన కుమారుడిని “అన్నింటికి వారసుడిగా” నియమించాడని రెండవ వచనం చెబుతోంది. అతను ప్రాథమిక వ్యక్తి, వారసత్వ హక్కును కలిగి ఉన్న కుమారుడు, ర్యాంకింగ్ వ్యక్తి, అందరికీ ప్రభువు, సమస్త సృష్టికి వారసుడు.
*సృష్టికర్త మరియు రాజు:*
“ఆది సంభూతుడు” అంటే క్రీస్తు సృష్టించబడిన జీవి అనే వాదన కొలొస్సీ 1:15 యొక్క సందర్భాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. గమనించండి, మీరు ఇప్పటికే 16,17వ వచనాలు ఆయనను ప్రతిదానికీ సృష్టికర్తగా స్పష్టంగా పేర్కొంటాయి.
*క్రీస్తు సృష్టిలో భాగం కాదు సృష్టికర్త;*
ఆయన సృష్టికర్త, దేవుని భుజం, విశ్వాన్ని మరియు అన్ని జీవులను ఉనికిలోకి పిలువడంలో మొదటి నుండి చురుకుగా ఉన్నారు.
యోహాను 1:3 ఇలా చెబుతోంది, “అన్నియు ఆయన ద్వారానే ఏర్పడ్డాయి, ఆయన లేకుండా ఏదీ ఏర్పడలేదు.” ఆయనే సృష్టించిన జీవి అయితే అది నిజం కాదు.
హెబ్రీయులు 1:2 కూడా క్రీస్తును సృష్టికర్తగా గుర్తిస్తుంది.
క్రీస్తు త్రిత్వానికి చెందిన వ్యక్తి, అతని ద్వారా ప్రపంచం సృష్టించబడింది ఆయన కోసమే సమస్తం సృజించబడింది.
*విశ్వం యొక్క పరిమాణం అపారమయినది:*
అదంతా చేసింది ఎవరు?
కొంతమంది శాస్త్రవేత్తలు ఎదో పెద్ద పేలుడు సంభవించిందని, అది చివరికి ఆదిమ చిత్తడినేలగా తయారైందని, మరియు … సైన్స్ దానిని వివరించలేకపోయింది. దేవుడు దానిని సృష్టించాడు అని మానవుడు గ్రహించాలి.
రెవ. డా. కిరణ్ కుమార్ సౌపాటి
సీనియర్ దైవ జనులు
నజరేతు ప్రేయర్ హౌస్, మిర్యాలగూడ