క్రీస్తు మార్గం… అనుసరణీయం

ఏసు ప్రభువు బోధనలు నిత్య అనుసరణీయం
* సేవా దృక్పథంతో చేసే పనులు విజయం సాధిస్తాయి                                                    

 

క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

నల్లమోతు సిద్దార్ధ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఏసు ప్రభువు బోధనలు నిత్య అనుసరణీయం అని యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరసోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సేవా దృక్పథంతో చేసే పనులు ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయని అన్నారు. ప్రపంచ శాంతి కోసం పరితపించిన ఏసు ప్రభువు బోధనలను ప్రతీ ఒక్కరూ అనుసరించాలని ఆకాంక్షించారు. ఏసు ప్రభువు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని అన్నారు. ప్రేమ,శాంతి, క్షమాగుణం, దయ, సత్యం, సౌభ్రాతృత్వం, త్యాగం వంటి సుగుణాలను క్రైస్తవ మతం ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. తోటి మనుషులను ప్రేమించాలని, మంచిని పంచాలని ఏసు ప్రభువు ప్రబోధించారని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking